BLN తెలుగు దినపత్రిక.శాయంపేట, జూన్ 6:శాయంపేట మండల ప్రజల రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శనివారం శాయంపేట మండల కేంద్రంలో నూతన ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించారు. పరకాల డిపో ఆధ్వర్యంలో నడిచే ఈ బస్సు శాయంపేట మీదుగా సాధనపల్లి వరకు రాకపోకలు నిర్వహించనుంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు బస్సుకు పూజలు నిర్వహించి జెండా ఊపి ప్రారంభించారు. సాధనపల్లి గ్రామ ప్రజలు చాలా కాలంగా నేరుగా బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారని, వారి విజ్ఞప్తికి స్పందిస్తూ ఈ సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.
ఈ బస్సు సర్వీసు ప్రారంభం వల్ల విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు మరియు గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రయాణ సౌకర్యం మరింత సులభతరం అవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని రవాణా సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
గౌరీ కొత్తపల్లి గంగిరేణి గూడెం ప్రగతి సింగారం పత్తిపాక శాయంపేట ఆత్మకూరు ఊరుగోడ మీదుగా హనుమకొండకు ఒక బస్సు నడవాలి
ReplyDeletePost a Comment