జనాభా లెక్కలు-2026 పరిశీలన చేసిన జిల్లా పంచాయతీ అధికారి

BLN తెలుగు దినపత్రిక.శాయంపేట, జూన్ 5: హనుమకొండ జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్ శుక్రవారం శాయంపేట మండలంలోని శాయంపేట, నేరేడుపల్లి గ్రామపంచాయతీలను సందర్శించి జనాభా లెక్కలు-2026 (సెన్సస్) ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో జరుగుతున్న జనాభా గణన పనుల పురోగతిని సమీక్షించి, సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు.
అనంతరం నేరేడుపల్లి గ్రామంలోని డంపింగ్ యార్డును పరిశీలించిన జిల్లా పంచాయతీ అధికారి, ఘన వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలని, తడి చెత్తతో వర్మీ కంపోస్టు తయారీని మరింత సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి పంచాయతీ అధికారి (డీఎల్పీఓ) రవిబాబు, గ్రామపంచాయతీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post