దామెర శివాలయంలో శఠగోపం దొంగతనం కేసు ఛేదననిందితుడు అరెస్ట్.. రూ.30 వేల నగదు స్వాధీనం

BLN తెలుగు దినపత్రిక.దామెర, జూన్ 5: దామెర మండల కేంద్రంలోని శివాలయంలో గత మార్చి నెలలో జరిగిన శఠగోపం దొంగతనం కేసును పోలీసులు ఛేదించి ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని శాయంపేట రూరల్ సీఐ వై. సుధాకర్ రెడ్డి తెలిపారు.
సీఐ తెలిపిన వివరాల ప్రకారం, శివాలయంలోని శఠగోపాన్ని దొంగిలించిన బుస్స అరవింద్ (20), కంఠాత్మకూర్ గ్రామానికి చెందిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, మహబూబాబాద్‌కు చెందిన అండెం గోపితో కలిసి ఈ నేరానికి పాల్పడినట్లు అంగీకరించాడు. దొంగిలించిన శఠగోపాన్ని విక్రయించి వచ్చిన రూ.30 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ కేసులో మరో నిందితుడు అండెం గోపి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిపారు.
నిందితుడు బుస్స అరవింద్‌పై గతంలో దొంగతనం, గంజాయి సంబంధిత కేసులు నమోదై ఉన్నాయని, అతనిని సంబంధిత సెక్షన్ల కింద కోర్టులో హాజరుపరుస్తున్నట్లు సీఐ వెల్లడించారు.
ఆలయాల ఆస్తులపై ఎవరైనా దురుద్దేశపూర్వక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శివాలయం దొంగతనం కేసుతో పాటు గంజాయి విక్రయాలకు పాల్పడిన నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన దామెర ఎస్సై కొంక అశోక్‌తో పాటు పోలీసు సిబ్బందిని సీఐ వై. సుధాకర్ రెడ్డి అభినందించారు



0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post