ఈత సరదా ప్రాణం తీసిందిచలివాగు ప్రాజెక్టు కాలువలో వ్యక్తి గల్లంతు

శాయంపేట, ఏప్రిల్ 19:
శాయంపేట మండలం జోగంపల్లి సమీపంలోని చలివాగు ప్రాజెక్టు వద్ద ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. కాలువలో ఈతకు దిగిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు.
స్థానికుల వివరాల ప్రకారం, గీసుకొండ మండలం మనుగొండ గ్రామానికి చెందిన మధ్యబోయిన వెంకన్న (35) పత్తిపాక గ్రామంలో జరిగిన తన బంధువు మధ్యబోయిన మొగిలి దశదిన కర్మ కార్యక్రమానికి హాజరయ్యాడు. కార్యక్రమం అనంతరం బంధువులతో కలిసి చలివాగు ప్రాజెక్టు వద్దకు వెళ్లిన వెంకన్న కాలువలో ఈతకు దిగాడు. ఈ సందర్భంగా నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో అదుపుతప్పి గల్లంతైనట్లు సమాచారం.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదిలా ఉండగా, ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ఈతకు వెళ్లవద్దని పోలీసులు పలుమార్లు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ, కొంతమంది యువకులు వాటిని పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post