జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

రాష్ట్ర ముఖ్యమంత్రి A. Revanth Reddy సోమవారం (ఏప్రిల్ 20) జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ దర్శనం, ప్రాజెక్టుల పరిశీలన, అధికారులతో సమీక్ష, రైతు భరోసా నిధుల విడుదల వంటి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
మధ్యాహ్నం 1.45 గంటలకు నివాసం నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి 2.00 గంటలకు బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా 3.00 గంటలకు Kaleshwaram Temple కు చేరుకుంటారు. అక్కడ 3.05 నుంచి 3.25 గంటల మధ్య శ్రీ కాలేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించి, ఆలయంలో భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు.
అనంతరం 3.30 గంటలకు కాలేశ్వరం నుంచి బయలుదేరి 3.45 గంటలకు మహాదేవపూర్ మండలం మేడిగడ్డకు చేరుకుని, 4.30 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజ్ ప్రాంతాన్ని పరిశీలిస్తారు.
తదుపరి 4.35 నుంచి 5.30 గంటల వరకు అంబట్‌పల్లి గెస్ట్ హౌస్‌లో ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం 5.35 నుంచి 6.00 గంటల వరకు మీడియా సమావేశంలో పాల్గొంటారు.
సాయంత్రం 6.00 గంటలకు మేడిగడ్డ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 6.30 గంటలకు కాటారం మండలం నస్తూరపల్లి గ్రామానికి చేరుకుంటారు. అక్కడ 6.30 నుంచి 7.45 గంటల వరకు రైతు భరోసా పథకం రెండో విడత నిధులను విడుదల చేస్తారు.
తదుపరి 7.45 గంటలకు నస్తూరపల్లి నుంచి బయలుదేరి రాత్రి 11.15 గంటలకు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నివాసానికి చేరుకుంటారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post