వడదెబ్బ నివారణపై అవగాహన – 108 అంబులెన్స్‌పై అకస్మిక తనిఖీలుజీవీకే ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు

శాయంపేట:ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్ర ఎండల కారణంగా వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో జీవీకే సంస్థతో కలిసి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు.
జీవీకేలో స్పెషల్ ఇన్‌చార్జ్‌గా ఉన్న గజేందర్ ఆధ్వర్యంలో వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు ఎండ సమయంలో బయటకు వెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తాగునీటి వినియోగం, శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం వంటి అంశాలను వివరించారు.
ఈ సందర్భంగా శాయంపేటలోని 108 అంబులెన్స్‌పై ప్రత్యేక అధికారులు అకస్మిక తనిఖీలు నిర్వహించారు. అంబులెన్స్‌లో ఉన్న పరికరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అత్యవసర పరిస్థితుల్లో అందించే వైద్యసేవలపై సమీక్షించారు.
ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ పాటి శివకుమార్, హనుమకొండ జిల్లా ఈఎంఈ మంద శ్రీనివాస్ పాల్గొన్నారు. వడదెబ్బకు గురైన రోగికి ఎలాంటి చికిత్స అందించాలి అనే విషయాన్ని ఈఎంఈ మండ శ్రీనివాస్ సిబ్బందికి వివరణాత్మకంగా వివరించారు. అదేవిధంగా వడదెబ్బను గుర్తించే ప్రత్యేక పరికరాన్ని అంబులెన్స్‌కు అందజేశారు.
ఈ కార్యక్రమంలో 108 సిబ్బంది ఈఎంటి అనిల్, పైలెట్ కేదారి తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు ఎండల సమయంలో అప్రమత్తంగా ఉండి, వడదెబ్బ నుంచి తమను తాము రక్షించుకోవాలని అధికారులు సూచించారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post