నవయుగ సొసైటీ పాలకవర్గ సమావేశం నిర్వహణగ్రామ అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలి – అధ్యక్షుడు కోసరి గోపాల్

తేదీ: 21-04-2026
శాయంపేట మండలం:
శాయంపేట మండలంలోని నవయుగ సొసైటీ ఆధ్వర్యంలో నేడు పాలకవర్గ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రజ్వల్ సీఈఓ రామ్మూర్తి, ప్రజ్వల్ ప్రాజెక్ట్ మేనేజర్ వై. ఇన్నారెడ్డి, నవయుగ సొసైటీ అధ్యక్షుడు కోసరి గోపాల్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు కోసరి గోపాల్ మాట్లాడుతూ, సంఘం అభివృద్ధి కోసం ప్రతి డైరెక్టర్ బాధ్యతతో కృషి చేయాలని సూచించారు. సొసైటీ అభివృద్ధికి అందరూ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
అనంతరం నూర్జహాన్‌పల్లి గ్రామానికి చెందిన నవయుగ డైరెక్టర్ అల్లె రాజీరు ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా గెలుపొందిన సందర్భంగా, ఆయనను నవయుగ సొసైటీ తరఫున శాలువాతో ఘనంగా సత్కరించారు. గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో నవయుగ పాలకవర్గ సభ్యులు ఆకుతోట ఈశ్వర్, జంగ సమ్మయ్య, చల్ల నరసింహారెడ్డి, కొల ఆనందం, గడ్డం రమేష్, ఎడ్ల రజిత, సముద్రాల రవి, లక్కం మల్లయ్య, ఒంటెరు రాజయ్య, నాండ్రే అశోక్, పరికరాల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post