శాయంపేట, ఏప్రిల్ 11:
శాయంపేట మండల కేంద్రం లో చిట్టీల పేరుతో పేద ప్రజలను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికంగా మాజీ సర్పంచ్‌గా పనిచేసిన వలుపదాసు చంద్రమౌళి అనే వ్యక్తి, చిట్టీలు నిర్వహిస్తూ పలువురి నుండి డబ్బులు సేకరించినట్లు ఆరో పణలు వినిపిస్తున్నాయి.
బాధితుల కథనం ప్రకారం కొంతమందికి ప్రారంభంలో చెల్లింపులు చేసి నమ్మకం కలిగించిన అనంతరం, పెద్ద మొత్తంలో డబ్బులు సేకరించి పరారైనట్లు తెలిపారు. అలా గే, శాయంపేట మండలం కేంద్రంలో పనిచేస్తున్న పరపతి సంఘాలలో సభ్యు లుగా ఉన్న పేద కూలి పనిచేసుకుంటూ పొదుపు చేసిన డబ్బులను కూడా ఆయన తీసుకున్నట్లు ఆరోపి స్తున్నారు. ఏళ్ల తరబడి కష్టపడి కూడబెట్టుకున్న సొమ్మును కోల్పోయిన బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు ఇచ్చిన వారికి ప్రస్తుతం జమ నాతూ పడ్డవారు చిట్టి డబ్బులు చెల్లించాలని సం ఘంలో ఉన్న పెద్దమనుషులు వలుపదాసు చంద్రమౌళికీ జమనాతూ పడ్డవారు కట్టా లని సంఘాలు ఒత్తిడి చేస్తున్నారు. ఉన్నత అధికారులు చొరవ తీసుకొని తిని పరిష్కారం చేయగలరు
Post a Comment