శాయంపేట మండలంలో జోగంపల్లి గ్రామంలో సామాజిక సమస్యలపై అవగాహన కల్పించే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, రైతులు, మహిళలు, అంగన్‌వాడీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గ్రామ సర్పంచ్ మరబోయిన ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కౌటం చరణ్ పాల్గొన్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ సీఐ శ్యాంసుందర్ హాజరై మానవ అక్రమ రవాణా ప్రమాదాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ప్రజ్వల్ సంస్థ సీఈఓ రామ్మూర్తి, హెచ్‌అండ్‌ఎం మేనేజర్ ఇన్నా రెడ్డి, ఎఫ్‌ఎమ్‌ఎమ్ కోఆర్డినేటర్ కరుణ, ఎఫ్‌ఎమ్‌ఎమ్ ప్రతినిధి శ్రీకాంత్, ప్రజ్వల్ పీయూ మేనేజర్ మానస చౌదరి, నవయుగ సొసైటీ డైరెక్టర్ లక్కం మల్లయ్య, చైల్డ్ లైన్ ప్రతినిధి విజయ్, ప్రజ్వల్ ఫీల్డ్ ఫెసిలిటేటర్ ఆనీఫా సునీల్ తదితరులు పాల్గొన్నారు.
ప్రసంగాల్లో భాగంగా బాలల రక్షణ, మహిళల భద్రత, మానవ అక్రమ రవాణా నివారణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. గ్రామస్థులు ఈ అంశాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Post a Comment