హనుమకొండ జిల్లాశాయంపేట మండలంలోకాట్రపల్లిలో సీనియర్ మేటు తొలగింపు వివాదం… సర్పంచ్ వివరణ

హనుమకొండ జిల్లా శాయంపేట మండల లోకాట్రపల్లి: గ్రామపంచాయతీలో గతంలో సీనియర్ మేటుగా పనిచేసిన మొక్కేటి రంజిత్ కుమార్ తొలగింపు అంశం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ఆయన చేపట్టిన అనేక ఈజీఎస్ (EGS) పనుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో, గ్రామపంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు కలిసి సమావేశం నిర్వహించి మేటును తొలగిస్తూ తీర్మానం చేసినట్లు సమాచారం.
ఈ తీర్మానంపై సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు సంతకాలు చేసి, అధికారికంగా రంజిత్ కుమార్‌ను పదవి నుంచి తొలగించినట్లు గ్రామ వర్గాలు తెలిపాయి.
అయితే, ఇటీవల ఉప సర్పంచ్ మేటు తొలగింపుకు సర్పంచే కారణమని ఆరోపణలు చేయడం వివాదానికి దారితీసింది. దీనిపై స్పందించిన కాట్రపల్లి సర్పంచ్, “మేటును తొలగించడం వ్యక్తిగత నిర్ణయం కాదు. గ్రామపంచాయతీ సమావేశంలో తీసుకున్న సామూహిక నిర్ణయం. దీనికి ఉప సర్పంచ్ సహా వార్డు సభ్యులందరూ సంతకాలు చేశారు” అని స్పష్టం చేశారు.
మీడియా ముందు గ్రామపంచాయతీలో ఆ రోజు జరిగిన తీర్మానం కాపీని చూపిస్తూ, అందులో ఉప సర్పంచ్, వార్డు సభ్యుల సంతకాలు ఉన్నాయని వివరించారు. తమపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని సర్పంచ్ తెలిపారు.జగన్ కాంగ్రెస్ పార్టీగ్రామ అధ్యక్షుడు
 మొగిలి EX.MPTC
వెంకటరాజం వార్డ్ నెంబర్
నర్సయ్య కాంగ్రెస్ సీనియర్ నాయకుడు
మొగిలి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి
 రాజయ్య సీనియర్ నాయకుడు
సుమన్ యూత్ అధ్యక్షుడు
 బాబు సింగ్EX వార్డ్ నెంబర్
 నరేష్ సీనియర్ నాయకుడు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post