ఉపాధి హామీ మేట్ తొలగింపు వివాదంరాజకీయ కక్షలే కారణమా..? జిల్లా అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం

శాయంపేట, ఏప్రిల్ 8:
మండలంలోని కాట్రపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సీనియర్ మేట్ ముక్కెర రంజిత్‌ను అకారణంగా తొలగించిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి తప్పు చేయకపోయినా కేవలం రాజకీయ కక్షలతోనే తనను పదవి నుంచి తొలగించారని బాధితుడు రంజిత్ ఆవేదన వ్యక్తం చేశాడు.
గ్రామ సర్పంచ్ సదర్ లాల్ వ్యక్తిగత ద్వేషంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని, తనపై తప్పుడు ఆరోపణలు మోపి గ్రామ సభలో తీర్మానం చేయించారని ఆయన ఆరోపించాడు. గత ఏడు సంవత్సరాలుగా జీతం లేకుండా కష్టపడి సేవలందించిన తనను ఒక్కసారిగా విధుల నుంచి తొలగించడం అన్యాయమని వాపోయాడు.
ఇంకా ఈ వ్యవహారంలో సంబంధిత అధికారులు కూడా రాజకీయ ఒత్తిళ్లకు లోబడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడం అధికారుల పనితీరుపై అనుమానాలు రేకెత్తిస్తోంది.
గ్రామ ఉపసర్పంచ్ బిక్షపతి, వార్డు సభ్యులు ఈ ఘటనకు సాక్ష్యాలుగా ఉన్నప్పటికీ చర్యలు తీసుకోకపోవడం మరింత అనుమానాలకు తావిస్తోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ఒక వ్యక్తి జీవనోపాధిని దెబ్బతీయడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటనపై జిల్లా అధికారులు వెంటనే జోక్యం చేసుకుని పూర్తి స్థాయి విచారణ జరిపి బాధితుడికి న్యాయం చేయాలని గ్రామస్థులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఈ వ్యవహారం పెద్ద స్థాయిలో ఆందోళనలకు దారితీసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post