గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామంలో గౌడ కులస్తుల ఆరాధ్యదేవుడు శ్రీ కంఠమహేశ్వరుని బోనాలు, కళ్యాణోత్సవం మంగళవారం వైభవంగా నిర్వహించారు. గ్రామమంతా పండుగ వాతావరణంలో మునిగిపోయింది.
ఈ నెల 5వ తేదీన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామమంతా మామిడి తోరణాలతో అలంకరించారు. భక్తులు విభూది ధరించి జలబందెలతో జాలాభిషేకం నిర్వహించారు. అనంతరం 6వ తేదీన పురుషులు తెల్ల పంచెలు, కండువాలు ధరించగా, మహిళలు పసుపు రంగు వస్త్రాలలో శోభాయమానంగా రేణుక ఎల్లమ్మ, శ్రీ కంఠమహేశ్వరుని బోనాలను తీసుకొని డప్పు చప్పుళ్ల నడుమ గ్రామంలో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని సమర్పించారు.
మంగళవారం సాయంత్రం బలిహారం, మొక్కు ముస్తాజులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకలు భక్తులకు కన్నుల పండుగగా నిలిచాయి.
ఈ కార్యక్రమంలో పరకాల బీజేపీ కానిస్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్, గౌడ జన హక్కుల పోరాట సమితి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్, గౌడ సంఘం అధ్యక్షులు పాలకుర్తి రాజేందర్ గౌడ్, తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, రోడ్డు భవనాల శాఖ డీఈ కల్లెపు కిరణ్ గౌడ్, పాలకుర్తి వెంకటేశర్లు గౌడ్, పాలకుర్తి రమేష్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, రాజేందర్ గౌడ్, ఎరుకల రవీందర్ గౌడ్, చింత సమ్మయ్య గౌడ్, పాలకుర్తి రామ్మోహన్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రాజేష్ గౌడ్, శ్యామ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment