రాష్ట్ర ప్రభుత్వం టెక్సో విధానాన్ని రద్దు చేసి టెండర్ విధానాన్ని ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ చేనేత కార్మికులు పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ టెండర్ విధానం వల్ల చేనేత రంగం ప్రైవేటీకరణ దిశగా వెళ్లి, సంప్రదాయ కార్మికులకు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ప్రతిపాదిత టెండర్ విధానం ద్వారా ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు వస్త్రాల కొనుగోలు ప్రక్రియలో పాల్గొనే అవకాశం కల్పించబడుతుందని, దీనివల్ల చిన్నతరహా చేనేత కార్మికులు పోటీ చేయలేక తీవ్రంగా నష్టపోతారని కార్మికులు పేర్కొన్నారు. ఈ విధానం అమలైతే చేనేత పద్మశాలి కార్మికులు పనిలేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వారు హెచ్చరించారు.
ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ, గతంలో అమలులో ఉన్న టెక్సో విధానం ద్వారా చేనేత కార్మికులకు నిరంతర ఉపాధి లభించిందని, వారి జీవనోపాధి స్థిరంగా కొనసాగిందని గుర్తుచేశారు. అందువల్ల టెండర్ విధానాన్ని వెంటనే రద్దు చేసి టెక్సో విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, వారికి చేతినిండా పని కల్పించే విధానాలను అమలు చేయాలని కోరారు. చేనేత రంగాన్ని కాపాడాలంటే టెక్సో విధానాన్ని కొనసాగించడం అత్యవసరమని కార్మికులు స్పష్టం చేశారు.
అఖిల భారత పద్మశాలి సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి బాసని బాలకృష్ణ
Post a Comment