మాందారిపేటలో నూతన రేషన్ షాప్ ప్రారంభంపేదలకు నిత్యావసర సరుకులు పారదర్శకంగా అందిస్తాం: ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

శాయంపేట మండలం మాందారిపేట గ్రామంలో నూతన రేషన్ షాపును భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మంగళవారం ప్రారంభించారు. బడిగే అశోక్‌కు చెందిన ఈ రేషన్ దుకాణం ప్రారంభోత్సవ కార్యక్రమం గ్రామంలో ఉత్సాహంగా జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు నిత్యావసర సరుకులను సమయానికి, పారదర్శకంగా అందించేందుకు కట్టుబడి ఉందన్నారు. గ్రామ స్థాయిలో రేషన్ దుకాణాల ఏర్పాటు ద్వారా ప్రజలకు సులభంగా సరుకులు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ కొత్త రేషన్ షాప్ ద్వారా మాందారిపేట గ్రామ ప్రజలకు మరింత సౌలభ్యం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రజలు కూడా రేషన్ సరుకులను సద్వినియోగం చేసుకుని తమ కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డీవో, శాయంపేట మండలం ఎమ్మార్వో, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post