గ్రామ భద్రతకు ముందడుగు… సీసీటీవీ కోసం విరాళం

శాయంపేట మండలంలోని మందారిపేట గ్రామ ప్రజలు గ్రామ భద్రతపై చైతన్యం ప్రదర్శిస్తూ ఆదర్శప్రాయంగా ముందుకు వచ్చారు. గ్రామంలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు కోసం రూ.10,000 విరాళాన్ని అందజేశారు.
గ్రామ ప్రజలు సమకూర్చిన ఈ మొత్తాన్ని పోలీస్ శాఖ ద్వారా సంబంధిత సీసీటీవీ టెక్నీషియన్‌కు అందజేశారు. గ్రామంలో భద్రతను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని పోలీసులు పేర్కొన్నారు.
సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ద్వారా గ్రామంలో జరిగే నేరాలను అరికట్టడంతో పాటు, నేరస్తులను సులభంగా గుర్తించవచ్చని పోలీసులు తెలిపారు. ఇది గ్రామ ప్రజలకు భద్రతాభావాన్ని పెంచడంలో కీలకంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.
ఇలాంటి చొరవ ప్రతి గ్రామంలో అవసరమని, శాయంపేట మండలంలోని ఇతర గ్రామాల ప్రజలు కూడా మందారిపేట గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని తమ గ్రామాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post