అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహానుభావుడు జ్యోతిరావు పూలేకు ఘన నివాళులు

శాయంపేట, ఏప్రిల్ 11 (ప్రత్యేక ప్రతినిధి):
అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. శనివారం జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని శాయంపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల నాయకులతో కలిసి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జ్యోతిరావు పూలే ఈ దేశంలో గొప్ప సామాజిక సంస్కర్తగా నిలిచారని పేర్కొన్నారు. ముఖ్యంగా వెనుకబడిన వర్గాలు, మహిళల విద్య అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి అపారమని అన్నారు. సమానత్వం, విద్యా హక్కుల సాధన కోసం ఆయన చేసిన పోరాటం నేటి సమాజానికి ఆదర్శప్రాయమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు చింతల రవిపాల్, బాసని రవి, వరదరాజు, మార్కండేయ, మామిడి సుదర్శన్, గాదె చిరంజీవి, కోల శీను, వీరన్న, పాపారావు, రాజయ్య, కుమార్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post