వివాహానికి ఆర్థిక సహాయం అందజేసిన ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ – మైలారంఅభినందనలతో ముందుకు వచ్చిన యువజన

శాయంపేట, ఏప్రిల్ 12:
శాయంపేట మండలంలోని మైలారం గ్రామానికి చెందిన ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సామాజిక సేవలో మరోసారి ముందుండింది. గ్రామానికి చెందిన ఎల్కతుర్తి భాగ్యలక్ష్మి – కీ.శే బిక్షపతి గార్ల కుమార్తె ఐశ్వర్య వివాహం సందర్భంగా ఆ కుటుంబానికి ఆర్థికంగా తోడ్పాటుగా రూ.5,000/- అందజేశారు.
ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ, అవసరంలో ఉన్న కుటుంబాలకు సహాయం చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. సమాజంలో పరస్పర సహకారం పెంపొందాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, అలాగే యువజన సంఘ సభ్యులు పాల్గొని వధూవరులకు ఆశీస్సులు అందజేశారు.
గ్రామస్థులు ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ చేసిన ఈ సేవను ప్రశంసిస్తూ, వారి సేవా భావాన్ని కొనియాడారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post