ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కల నెరవేరుతూ వారి కళ్లల్లో ఆనందం కనిపిస్తోందని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.
ఆదివారం శాయంపేట మండలంలోని మందారిపేట గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకున్న ఓరుసు కోమల – కిష్టయ్య దంపతులు గృహ ప్రవేశం నిర్వహించగా, ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ఇల్లు ప్రారంభించి వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదల సొంతింటి కల సాకారం అవుతోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రెండో విడతలో కూడా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. గ్రామస్థులు ఎమ్మెల్యేను అభినందిస్తూ, ప్రభుత్వ పథకాలు పేదలకు మేలు చేస్తున్నాయని పేర్కొన్నారు.
Post a Comment