శాయంపేట, జూన్ 5: ఇంటర్ నుంచి పీజీ వరకు చదువుతున్న, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఫీజులు చెల్లించలేని పద్మశాలి విద్యార్థుల కోసం పద్మశాలి ట్రస్ట్ ఆధ్వర్యంలో హనుమకొండలో హాస్టల్ వసతి కల్పిస్తున్నట్లు తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం శాయంపేట మండల అధ్యక్షుడు వంగర సాంబయ్య తెలిపారు.
హనుమకొండ హంటర్ రోడ్‌లో ఉన్న పద్మశాలి హాస్టల్ భవనంలో అర్హులైన విద్యార్థులకు వసతి సదుపాయం అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని పద్మశాలి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆసక్తి గల వారు తెలంగాణ ప్రాంతీయ పద్మశాలి సంఘం శాయంపేట మండల అధ్యక్షుడు వంగర సాంబయ్య (9704934379), జిల్లా కార్యదర్శి దిడ్డి రమేష్ (9849232056), రాష్ట్ర కార్యదర్శి వైద్యం రాజగోపాల్ (6304721396), జిల్లా అధ్యక్షుడు (9908507239)లను జిల్లా ప్రచార కార్యదర్శి బాసని బాలకృష్ణ సంప్రదించాలని సూచించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షుడు వంగర సాంబయ్య, ఉపాధ్యక్షుడు చిందాం రవి, భాషని ప్రకాష్, వనం దేవరాజ్, బాసర నవీన్, ఆడెపు అశోక్, గాజుల రాజు, తుమ్మ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment