పత్తిపాక వాసి కందగట్ల గణేష్ కు వివేకానంద జాతీయ ఇన్స్పిరేషన్-2026 అవార్డు"

హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామవాసి కందగట్ల గణేష్ గత మూడు దశాబ్దాలుగా ఆంగ్ల బోధనతో పాటు, పలు సామాజిక కార్యక్రమాలు మరియు విస్తరణ ఉపన్యాసాలు చేసి ఎంతోమంది విద్యార్థులకు విషయ జ్ఞానంతో పాటు జీవిత పాఠాలు బోధించి ప్రేరణగా నిలిచారు. గణేష్ చేసిన ఈ సేవకు గాను తమిళనాడు రాష్ట్రంలోని ఇండియన్ ఫోరం వారు వివేకానంద నేషనల్ ఇన్స్పిరేషన్ -2026 అవార్డు ప్రకటించారు. ఈ అవార్డు తను పనిచేస్తున్న వెల్దిలోని ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాలకుర్తి శ్రీధర్ ద్వారా అందుకోవడం జరిగింది. గతంలో కూడా గణేష్ అనేక అవార్డ్స్ అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ ఈ అవార్డు తనకు మరింత బాధ్యత పెంచిందన్నారు. తనకు ఎప్పుడు బాసటగా నిలుస్తూ, ప్రోత్సహిస్తున్న ఉన్న ప్రిన్సిపాల్ గారికి, తన తోటి ఉపాధ్యాయులకి మరియు కుటుంబ సభ్యులకి ఈ అవార్డు ప్రధానం చేసిన సందర్బంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

1 Comments

Post a Comment

Post a Comment

Previous Post Next Post