మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

పరకాల ఇందిరా మహిళా డైరీ ఆధ్వర్యంలో పరకాల ఇందిరా మహిళా పాల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య లిమిటెడ్ చీఫ్ ప్రమోటర్ల సమావేశం మంగళవారం హనుమకొండ భవానీనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ అధికారులతో కలిసి ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆత్మవిశ్వాసం, నమ్మకానికి ప్రతిరూపాలని పేర్కొన్నారు. పరకాల ఇందిరా మహిళా డైరీకి ఇప్పటికే 10 వేల మందికి పైగా మహిళలు సభ్యత్వం స్వీకరించడంతో పాటు వాటాదారులుగా నమోదు అయ్యారని తెలిపారు. గేదెలు లేని మహిళలకు సబ్సిడీపై రుణాలు, గడ్డి విత్తనాలు ఇవ్వడం, మందులు, తక్కువ ధరకే దాణా, గేదెల పెంపకం, డైరీ నిర్వహణపై సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.ప్రతి గ్రామంలో వెటర్నరీ వైద్యుల సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడతామని, ముల్కనూరు డైరీ నిపుణుల ద్వారా శిక్షణ ఏర్పాటు చేసి, పశుపోషణకు సంబంధించిన అన్ని విషయాలపై అవగాహన కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.70 సంవత్సరాల లోపు మహిళలందరూ సభ్యత్వం తీసుకోవడానికి అర్హులని, చిన్న రైతులు, చిన్న కుటుంబాలు అభివృద్ధి చెందడమే పరకాల ఇందిరా మహిళా డైరీ లక్ష్యమని చెప్పారు. మొత్తం డైరీ పరిధిలో 58 పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు ఉన్నాయని, డైరీకి సంబంధించిన అన్ని పనులను త్వరితగతిన పూర్తి చేసి, త్వరలోనే పూర్ణ స్థాయిలో ప్రజలకు సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి వెల్లడించారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post