శాయంపేట మండల కేంద్రంలో అతి పురాతనమైన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో మాల ధరించి 41 రోజుల పాటు కఠిన నియమాలు ఆచరిస్తూ అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న స్వాములు బుధవారం దేవాలయ చైర్మన్ గురు స్వామి సామల బిక్షపతి ఆధ్వర్యంలో ఇరుముడి కట్టుకొని శబరిమల యాత్రలకు బయలుదేరినారు. గురుస్వామి గోపాలకృష్ణ శర్మ స్వామియే శరణమయ్యప్ప అంటూ శరణు ఘోష తో భజనలు చేస్తూ అయ్యప్ప మాల విశిష్టత తెలియజేస్తూ స్వాములకు ఇరుముడి కట్టినా రు. తరువాత స్వాములకు గొట్టుముక్కల రామ్మూర్తి అన్నదాన కార్యక్రమం నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో గొట్టిముక్కుల రమేష్ సామల నాగరాజు వనం విశాల్ సామల రవీందర్ వనం దేవరాజు వినుకొండ రాజ్ కుమార్ భాషని బాలకృష్ణ లోక బోయిన కుమారస్వామి కానుగుల నాగరాజు భక్తులు పాల్గొన్నారు
శబరిమలై యాత్రకు బయలుదేరిన మాల ధరించిన అయ్యప్ప స్వాములు
byBLN TELUGU NEWS
-
0
Post a Comment