శాయంపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల (బాలికల) హాస్టల్లో ఫైనాన్షియల్ లిటరసీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

శాయంపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల (బాలికల) హాస్టల్లో ఫైనాన్షియల్ లిటరసీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 
ఏ జీ ఎం చేతన్ గోరెఖర్ రావడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యత పైన విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని, మరియు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలపడం జరిగింది, 
అదేవిధంగా అపరిచిత లింకులను ఓపెన్ చేసి మోసపోవద్దని, మరియు ఉచిత బహుమతులకు ఆశపడి ఖాతాలో ఉన్న డబ్బులను పోగొట్టుకోవద్దని ఈ సందర్భంగా అన్నారు, 
విద్యార్థులు చిన్నప్పటి నుండే వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఇచ్చిన డబ్బులను పొదుపు చేసుకొని ఆర్థిక క్రమశిక్షణను అలవర్చుకోవాలని ఈ సందర్భంగా అన్నారు 
ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ హనుమకొండ జన్ను మహేందర్, మరియు ఎస్బిఐ శాయంపేట మేనేజర్ ఫాతిమా, పాఠశాల సిబ్బంది, మరియు ఎఫ్ ఎల్ సి మదన్ గోపాల్, మరియు సి ఎఫ్ ఎల్ పరకాల కౌన్సిలర్స్ క్రాంతి, విజయ్, ప్రసాద్, మరియు ఎల్కతుర్తి కౌన్సిలర్, వెంకటేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post