శాయంపేట మండలం పెద్దకొడపాక గ్రామంలోని శ్రీ వేద పాఠశాలలో శనివారం ముందస్తు సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు రంగవల్లులు వేసి, గొబ్బెమ్మలు ఏర్పాటు చేసి సంప్రదాయబద్ధంగా సంక్రాంతి పండుగను జరుపుకున్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థులు మరచిపోకుండా వారికి గుర్తు చేసే ఉద్దేశంతో పాఠశాల స్థాయిలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయుడు విజయ్ తెలిపారు.
అనంతరం విద్యార్థులకు స్వీట్లు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రియాంక, కీర్తి రెడ్డి, వేద, సౌందర్యతో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.
Post a Comment