శాయంపేట కాంగ్రెస్ నాయకుల పరిస్థితి: దొంగ దొంగ అంటూ భుజాలు తడుముకున్నట్లు!

శాయంపేట మండల కేంద్రంలో మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగుల మనోహర్ రెడ్డి మాట్లాడుతూ...చెప్పుతో కొట్టినవారు ఎవరు? చెప్పు దెబ్బలు తిన్నవారు ఎవరు?అసలు మాకు సంబంధం లేని విషయాన్ని కావలసుకొని మా నాయకుడు గండ్ర వెంకటరమణారెడ్డి మీద లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్న అధికార పార్టీ నాయకులారా!👉 మీ గొడవలు మీరే పెట్టుకుంటున్నారు, మీ గోతులు మీరే తవ్వుకుంటున్నారు. ప్రజలు గమనిస్తున్నారు—సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతారు.
👉 ఏ పత్రికలోనూ మీ పేరు లేదా మీ నాయకుడి పేరు రాలేదు, కానీ 'అది మా నాయకుడే' అని మీరే చెప్పుకుంటున్నారు.ప్రజాధరణ ఉన్న నాయకుడు రమణారెడ్డి మీద బురదజల్లడం దిగజార్చుడు పని. మా నాయకుడికి అలాంటివి అవసరం లేదు.👉 గతంలో 'మన ఊరు మన రమణన్న' కార్యక్రమంలో దళిత కుటుంబాల్లో నిద్రించిన గొప్ప రమణారెడ్డి.
👉 ప్రభుత్వ చీఫ్ విప్‌గా, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, దళితులకు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా అనేకసార్లు సేవ చేసిన మహనీయుడు. అలాంటి నాయకున్ని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేయడం మానుకోండి.👉 శాయంపేట మండలంలో రమణారెడ్డి అభివృద్ధి తప్ప మీరు తట్టెడు మట్టి పోసలేదు.👉 మా నాయకుడు తెరచాటున ఉండి, మీలాగా దొంగమాటలు చెప్పడు. నిరంతరం ప్రజల సంక్షేమానికి పరితపిస్తూ, ప్రతి పేద కుటుంబంలో పెద్ద కొడుకులా ఉండే మహా నాయకుడు. విమర్శలు చేయకండి.👉 మళ్లీ ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు. అధికారం ఉందని నోటికి వచ్చినట్లు మాట్లాడితే మమ్మల్ని ఊరుకుంటారని అనుకోకండి—మా నాయకుడిని అంటే ఊరుకునే ప్రసక్తి లేదు!👉 ఎంతోమంది దళితుల కులాంతర ప్రేమ వివాహాలకు ఆర్థిక సహాయం చేసిన మా నాయకుడు. మా సహాయంతో పదవులు పొంది లబ్ధి చూసినవారు ఇప్పుడు కాకమ్మ కబుర్లు చెప్పి ఆరోపణలు చేయడం తప్పు.👉 రైతులు యూరియా దొరక అష్టకష్టాలు పడుతుంటే పట్టించుకోకుండా మీరే గొడవలు పెట్టుకుని, హామీలు నెరవేర్చకుండా కాలం వదలిపెట్టడం సరికాదు. ఇలా చేస్తే ప్రజలు రానున్న రోజుల్లో గుణపాఠం చెబుతారు.— మెతుకు తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ & గంగుల మనోహర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, శాయంపేట.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post