పరామర్శించారు: నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి అమ్మ కాంతమ్మ మూడు రోజుల క్రితం స్వర్గస్తులయ్యారు. ఈరోజు హనుమకొండలోని వారి నివాసంలో దొంతి మాధవ రెడ్డి పరామర్శించి.. కాంతమ్మ చిత్ర పటానికి వరంగల్ కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి నివాళులు అర్పించారు.
16వ డివిజన్ ధర్మారం ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వారు : 16వ డివిజన్ ధర్మారం ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో నిర్వహించే భవాని అమ్మవారి ముక్కుపుడక వేలంపాట ఈసారి విశేషంగా జరిగింది. ఛైర్మన్ గారు అమ్మవారి ముక్కుపుడకను రూ.40,100/-కి కైవసం చేసుకున్నారు. ఈరోజు యూత్ అసోసియేషన్ సభ్యులు ఛైర్మన్ గారిని కలిసి సమర్పించారు.
ఇన్నర్ రింగ్ రోడ్ బాదితులు : ఈరోజు ఛైర్మన్ నివాసంలో ఇన్నర్ రింగ్ రోడ్ బాదితులు కలిసి వారి సమస్యలను విన్నవించుకున్నారు. ఎంతో కాలంగా పెండింగులో ఉన్న వారి సమస్యలను సానుకూలంగా విని, తప్పకుండా త్వరితగతిన వారి సమస్యలను పరిష్కరిస్తానని మాట ఇచ్చారు.
Post a Comment