డోకా కార్డ్ – బాకీ కార్డ్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు: నిజమైన అభివృద్ధి బీజేపీతోనే సాధ్యంమండల బీజేపీ అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణు

భారతీయ జనతా పార్టీ శాయంపేటమండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ  ఈ రోజు మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజల ఓట్లను దోచుకోవడం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు “డోకా కార్డ్” మరియు “బాకీ కార్డ్” పేరుతో కొత్త రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయన్నారు.
ప్రజల నిజమైన సమస్యలను పక్కనబెట్టి, తప్పుడు హామీలతో రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించడం ప్రజాస్వామ్యానికి అవమానమన్నారు.కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటూ, నమ్మకాన్ని మోసం చేస్తోందన్నారు.
గతంలో ఇచ్చిన రుణమాఫీ, గృహనిర్మాణం, ఉచిత విద్యుత్, మహాలక్ష్మి, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, ఉద్యోగాల వంటి వాగ్దానాల్లో ఒక్కటీ నిలబెట్టుకోలేకపోయిందని మండిపడ్డారు.ఇప్పుడు “డోకా కార్డ్” పేరుతో మరోసారి ప్రజల మనసులను గెలుచుకోవడానికి కొత్త నాటకం మొదలుపెట్టిందని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి అంటే కేవలం ఓట్లు పొందే ప్రలోభాలు మాత్రమే అని వ్యాఖ్యానించారు.
కేంద్రం ఇచ్చిన నిధులను కూడా సరైన విధంగా వినియోగించకపోవడం వల్ల అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయని అన్నారు “కాంగ్రెస్ పార్టీకి ప్రజల సమస్యలు కాదు, కుర్చీ రాజకీయాలే ముఖ్యమైనవి,” అని నరహరిశెట్టి రామకృష్ణ గారు అన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాలనలో ప్రజల అభివృద్ధి కన్నా కుటుంబ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చిందన్నారు.
“బాకీ కార్డ్” అనే పేరుతో మరోసారి ప్రజల నమ్మకాన్ని దోచుకోవాలని చూస్తోందని అన్నారు.
రైతు, విద్యార్థి, నిరుద్యోగి, కూలి — ప్రతి వర్గం మోసపోయిందని, బీఆర్ఎస్ పాలన ప్రజా విసుగుకు దారి తీసిందని పేర్కొన్నారు.
నిధుల పంపకంలో అవినీతి, ప్రాజెక్టులలో జాప్యం, స్థానిక అభివృద్ధిలో నిర్లక్ష్యం — ఇవన్నీ బీఆర్ఎస్ వైఫల్యాలే అన్నారు.
ప్రజల కష్టాలపై రాజకీయ లాభం పొందాలనే పార్టీ లక్ష్యం తప్ప ప్రజా సేవా దృక్పథం లేదు అని ఆయన విమర్శించారు.బీఆర్ఎస్ పాలన అంటే అవినీతి, అసమానత, ఆడంబరమే!” అని రామకృష్ణ గారు వ్యాఖ్యానించారు.భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు — ప్రజల మేలు కోసం నిరంతర కృషిచేస్తుందని
కేంద్ర ప్రభుత్వ పథకాలు:
ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (PMAY): పేదలకు గృహ సౌకర్యం కల్పించడానికి లక్షలాది ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి.ఉజ్వల యోజన: గ్యాస్ సబ్సిడీ ద్వారా గ్రామీణ మహిళల ఆరోగ్య భద్రత.పీఎం కిసాన్ సమ్మాన్ నిధి: ప్రతి రైతుకు సంవత్సరానికి ₹6,000 రూపాయలు నేరుగా అందించడం.ఆయుష్మాన్ భారత్: పేదలకు ₹5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు.స్వచ్ఛ భారత్ మిషన్: ప్రతి గ్రామం పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా ఉండేలా చర్యలు.డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా: యువతకు ఉపాధి అవకాశాల పెంపు, దేశీయఉత్పత్తి అభివృద్ధికేంద్ర పథకాలు ప్రతి గ్రామానికి చేరేలా బీజేపీ కార్యకర్తలు అహర్నిశలు శ్రమిస్తున్నారు.తాగునీరు, రహదారులు, పాఠశాల అభివృద్ధి వంటి స్థానిక సమస్యలను గుర్తించి అధికారులకు నివేదికలు సమర్పిస్తున్నారు.
యువతకు నైపుణ్య శిక్షణ, మహిళలకు ఆర్థిక సాధికారత కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ప్రజలతో నేరుగా మమేకమై సమస్యలు పరిష్కరించేందుకు “జనసంపర్క అభియాన్” కార్యక్రమం కొనసాగుతోంది. “డోకా కార్డ్ – బాకీ కార్డ్ రాజకీయాలతో ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల దురవినీతిని నిరూపిస్తోంది.”“ప్రజలకు నమ్మకం, అభివృద్ధి, భద్రత కల్పించగల శక్తి ఉన్న పార్టీ ఒక్కటే — భారతీయ జనతా పార్టీ.”బీజేపీ మాటలకే కాకుండా, పనుల ద్వారా ప్రజల విశ్వాసం గెలుచుకుంటోంది.”ప్రజల మోసపూరిత కార్డుల రాజకీయాలకు తావివ్వకుండా, అభివృద్ధి కోసం కృషి చేసే భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వండి. నిజాయితీతో కూడిన పరిపాలనకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు భూతం తిరుపతి, మామిడి విజయ్, జిల్లా సీనియర్ నాయకులు బాసాని విద్యాసాగర్ వనం దేవరాజ్, గడ్డం రమేష్ ఉప్పు రాజు, మోత్కూరి సత్యనారాయణ యువమోర్చా జిల్లా నాయకులు లడే శివ, కొత్తపెళ్లి శ్రీకాంత్, బత్తుల రవి తదితరులు పాల్గొన్నారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post