పద్మశాలి యువసేన నూతన కమిటీ ఎన్నిక

శాయంపేట, మండలంలోని పద్మశాలి యువసేన సంఘం నూతన కమిటీ ఎన్నిక శుక్రవారం పద్మశాలి సంఘ భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలి యువసేన పరపతి సంఘం 18వ వార్షికోత్సవ సర్వసభ్య సమావేశాన్ని మాజీ అధ్యక్షులు వడ్డేపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించి 2024 - 25 సంవత్సర లావాదేవీలను పరిశీలించి ఆమోదించారు. అనంతరం ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులుగా బూర లక్ష్మీనారాయణ, వలుపదాసు చంద్రమౌళి, బాసవి ప్రకాష్ ల ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా వనం దేవరాజు, గౌరవ అధ్యక్షులుగా వడ్డేపల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా బాసని బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా మంత్రి రమేష్ బాబు, కోశాధికారి సామల క్రాంతి కుమార్, సహాయ కార్యదర్శి కోమటి శేఖర్, కమిటీ సభ్యులుగా గొట్టిముక్కుల రాజు, వలుపదాసు సాంబయ్య, బాసని రాజు, మునుకుంట్ల సదానందo, కడారి చంద్రమౌళిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సలహాకమిటీ సభ్యులుగా వల్పదాసు చంద్రమౌళి, బాసని ప్రకాష్, బూర లక్ష్మి నారాయణ, గొట్టిముక్కుల రామ్మూర్తి, తుమ్మ ప్రభాకర్ లు ఉన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్షులు దేవరాజు మాట్లాడుతూ సంఘ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తన ఎన్నికలకు సహకరించిన సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు గోరంట్ల ప్రశాంత్, బాసని సంతోష్, మార్త సుమన్,బాసని సంతోష్, వెంకటేశ్వర్లు, పరిమళ్ళ కుమారస్వామి,తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post