న్యాయస్థానాల నుండి ఎలాంటి స్పందన ఉన్నా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఇచ్చిన హామీపై కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని కొప్పుల జోగంపల్లి పెద్ద కొడెపాక గోవిందపూర్ హుస్సేన్ పల్లి పత్తిపాక గ్రామాలలో ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. ఈ క్రమంలో కేంద్రం ఓటు చోరికి పాల్పడుతుందని ప్రజల సంతకాలను సేకరించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో బుచ్చిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శాస్త్రీయంగా కులగణన చేసి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని, శాసనసభలో బిల్లు పాస్ చేయించి గవర్నర్, రాష్ట్రపతికి పంపిస్తే బిజెపి అడ్డుకుందని ఆరోపించారు. అలాగే 2019 స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీల రిజర్వేషన్లను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 50 శాతం మించకుండా కుదించిందని అన్నారు. ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ కులగనన చేసి రిజర్వేషన్లు పెంచాల్సి ఉండగా ఎందుకు పెంచలేదో బీసీలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బిజెపి, బీఆర్ఎస్ లు బీసీల వ్యతిరేక పార్టీలుగా మిగిలిపోయాయని అన్నారు. కేంద్రంలో ఉన్న బిజెపి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఓటు చోరీ చేస్తుందని, ఓటు చోరి ఆపాలంటూ రాహుల్ గాంధీ చేస్తున్న ఓటు చోరీ పోరాటానికిమద్దతుగా ప్రజల వద్ద సంతకాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి మారేపల్లి రవీందర్ చిందం రవి, చిట్టి రెడ్డి రాజిరెడ్డి డిటి రెడ్డి సామల మధుసూదన్ నిమ్మల రమేష్ వైనాల కుమారస్వామి హైదర్
బీసీలకు ఇచ్చిన హామీ పై కట్టుబడి ఉన్న కాంగ్రెస్ బీసీ ద్రోహులుగా మిగిలిపోయిన బీజేపీ, బీఆర్ఎస్
byBLN TELUGU NEWS
-
0
Post a Comment