రిజర్వేషన్ల అంశం కోర్టు పరిధిలో ఉండగా నోటిఫికేషన్ విడుదలపై వెల్లువెత్తుతున్న విమర్శలు.ప్రభుత్వ పథకాల ప్రచారాలు, వాటికి సంబంధించిన ఆనవాళ్లను తొలగింపునకు కోట్ల రూపాయలు వృథా.ఎన్నికల ప్రక్రియలో భాగమైన ఆర్వోలు, ఏఆర్వోలు, పీవోలకు ఫిబ్రవరిలో రెండుసార్లు, ఇప్పుడు రెండు సార్లు ట్రైనింగ్ ఇచ్చారు. మళ్లీ ఎన్నికలు నిర్వహించినప్పుడు మరొకసారి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని. ఇలా దీనికి కూడా అదనపు ఖర్చు తప్పదని చెబుతున్న అధికారులు.ఒక్కో మండలంలో నామినేషన్ సెట్ల జిరాక్సులకు రూ.లక్షల్లో ఖర్చు పెట్టారు. ఈ ఖర్చు రాష్ట్ర వ్యాప్తంగా లెక్కలు వేసుకుంటే రూ.కోట్లలో అవుతుందని చెబుతున్నారు. ఎన్నికలు ఎక్కువ రోజులు వాయిదా పడితే ఓటర్ జాబితా ఆప్ డేట్ చేసి మళ్లీ అప్పుడు కూడా జీరాక్స్ తీయాల్సి ఉంటుంది. అప్పుడు సైతం అదనపు ఖర్చు తప్పదు. ఇలా అనేక రకాలుగా ప్రజాధనం వృథా అయ్యాయని పలువురు అధికారులు చెబుతున్నారు
ఎన్నికల సంఘం తొందరపాటుతో కోట్ల రూపాయల్లో నష్టం.!
byBLN TELUGU NEWS
-
0
Post a Comment