జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) అబ్జర్వర్ .జాన్సన్ అబ్రహం ఈ నెల 13 అక్టోబర్ 2025 (సోమవారం) రోజున రానున్నారని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన పత్రిక ప్రకటనలో మాట్లాడుతూ, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి కోసం పోటీపడదలచిన ఆశావాహులు తమ దరఖాస్తులను భూపాలపల్లిలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం (సత్తన్న ఆఫీస్) లో శనివారం నుండి సమర్పించవచ్చని తెలిపారు.అలాగే, దరఖాస్తుల స్వీకరణ సమయంలో తానే జిల్లా కార్యాలయంలో అందుబాటులో ఉంటానని అయిత ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా అధ్యక్ష పదవికి ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు తమ దరఖాస్తులను వ్యక్తిగతంగా సమర్పించగలరని ఆయన సూచించారు.
ఏఐసీసీ అబ్జర్వర్ జాన్సన్ అబ్రహం జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు రాక...
byBLN TELUGU NEWS
-
0
Post a Comment