ప్రజల అవసరాలు, అభ్యున్నతే ప్రజాపాలన లక్ష్యం- భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం భూపాలపల్లి, 
ప్రజల అవసరాలు, అభ్యున్నతే ప్రజాపాలన లక్ష్యమని, తెలంగాణ ప్రజలకు మంచి చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో భాగంగా భూపాలపల్లి మంజూరునగర్ లోని ఎమ్మెల్యే  క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో. ఎమ్మెల్యే పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల అవసరాలు, అభ్యున్నతే ప్రజాపాలన లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడం, పారదర్శకత, జవాబుదారీతనం ప్రజాపాలనకు మూల సూత్రాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, అభిమానులు ఉన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post