మహిళలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణే కుటుంబ ఆరోగ్యానికి పునాదిగా - భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

 జూకల్ గ్రామంలో పోషణ మాసోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జీఎస్సార్..
- విశ్వకర్మ భగవానుడు సృష్టికి మూలమన్న ఎమ్మెల్యే జీఎస్సార్..
- కాంగ్రెస్ సీనియర్ నేత చెన్న చందర్ కుటుంబానికి అండగా ఉంటానన్న ఎమ్మెల్యే జీఎస్సార్..
- రూ.1,90,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను తిరుమలాపూర్ గ్రామంలో చందర్ ఇంటికి వెళ్ళి ఇచ్చిన ఎమ్మెల్యే జీఎస్సార్..
చిట్యాల మండలం,మహిళలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణే కుటుంబ ఆరోగ్యానికి పునాదని, ప్రతి ఇంటికి ఆరోగ్య సదుపాయాలు చేరే వరకు కృషి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.
ఈరోజు చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా వైద్యారోగ్యశాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వస్త్ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమానికి రాష్ట్ర గిరిజన డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మె‌న్‌ డాక్టర్ బెల్లయ్య నాయక్, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజానికి మెరుగైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడం ద్వారా మహిళలకు, చిన్నారులకు సాధికారత కల్పించడమే ఈ అభియాన్ ప్రధాన లక్ష్యమన్నారు. ఆరోగ్యవంతమైన తల్లి, ఆరోగ్యవంతమైన శిశువు ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రతి గ్రామం, ప్రతి వాడలో ఈ కార్యక్రమం సఫలమయ్యేలా వైద్య సిబ్బంది, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ అభియాన్ ద్వారా మహిళలకు ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు, గర్భిణీ స్త్రీలకు సమగ్ర వైద్య పరీక్షలు, చిన్నారుల కోసం టీకా కార్యక్రమాలు, పోషకాహారంపై అవగాహన ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. గ్రామాల్లోని ప్రతి ఇంటికి ఆరోగ్య సదుపాయాలు చేరే వరకు కృషి చేస్తానని, ప్రజల సహకారంతో ఈ అభియాన్ విజయవంతం కావాలని కోరారు.
జూకల్ గ్రామంలో పోషణ మాసోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జీఎస్సార్..
చిట్యాల మండలం జూకల్ గ్రామ రైతు వేదికలో జిల్లా సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషణ మాసోత్సవం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పోషణతోనే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యమన్నారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారులకు సమయానికి సరైన పోషకాహారం అందించడం ద్వారా సమాజ ఆరోగ్యాన్ని కాపాడవచ్చని పేర్కొన్నారు. ప్రతి ఇంటిలో పోషకాహారం అందుబాటులో ఉండేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోషకాహారం - ప్రతి కుటుంబ హక్కు అనే నినాదంతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
విశ్వకర్మ భగవానుడు సృష్టికి మూలమన్న ఎమ్మెల్యే జీఎస్సార్..
విశ్వకర్మ భగవానుడు సృష్టికి మూలమని ఆయన వారసులుగా విశ్వబ్రాహ్మణులు కుల వృత్తులు చేస్తూ సమాజానికి ఎంతో తోడ్పాటును అందిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. చిట్యాల మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం చిట్యాల మండల కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విశ్వకర్మలు అన్ని రంగాల్లో ముందుండాలని ప్రజా ప్రభుత్వం కుల వృత్తులను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని ఎమ్మెల్యే అన్నారు.విశ్వకర్మలు కొన్ని చోట్ల దేవాలయాల్లో పూజారులుగా కొనసాగుతున్నారని వారికి ప్రభుత్వం నుండి దూప దీప నైవేద్యాల పథకం ద్వారా గౌరవ వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. విశ్వకర్మ భగవానుని చరిత్ర భవిష్యత్తు తరాలకి అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం విశ్వకర్మ జయంతిని అధికారికంగా నిర్వహిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.
కాంగ్రెస్ సీనియర్ నేత చెన్న చందర్ కుటుంబానికి అండగా ఉంటానన్న ఎమ్మెల్యే జీఎస్సార్..
కాంగ్రెస్ సీనియర్ నేత చెన్న చందర్ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని ఎమ్మెల్యే జీఎస్సార్ అన్నారు. అనారోగ్యంతో చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న తిరుమలాపూర్ గ్రామానికి చెందిన చెన్న చందర్ కి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ.1,90,000 విలువచేసే రెండు చెక్కులు మంజూరు కాగా, ఈరోజు తిరుమలపూర్ లోని చందర్ ఇంటికి రాష్ట్ర గిరిజన డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మె‌న్‌ డాక్టర్ బెల్లయ్య నాయక్, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి వెళ్లి ఎమ్మెల్యే జీఎస్సార్ స్వయంగా వెళ్లి అట్టి చెక్కులను అందజేశారు. ధైర్యంగా ఉండాలని చందర్ కు ఎమ్మెల్యే సూచించారు. 

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post