- భూపాలపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో యాత్రా దానం పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జీఎస్సార్..
*భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం:
సామాజిక సేవలో భాగంగా వినూత్న ఆలోచనతో యాత్రా దానం కార్యక్రమాన్ని టీజీఎస్ఆర్టీసీ అమల్లోకి తీసుకురావడం అభినందనీయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు సాయంత్రం భూపాలపల్లి మంజూరునగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భూపాలపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందూ, జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) విజయలక్ష్మీ, కాంగ్రెస్ నేతలతో కలిసి యాత్రా దానం పోస్టర్ ను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రసిద్ధ దేవాలయాలకు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలని చాలా మందికి ఉంటుందని, అలాంటి వారికి యాత్రా దానం కార్యక్రమం ఒక వరమని అన్నారు. అదనపు ఆదాయాన్ని గడించేందుకు తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్(టీజీఎస్ఆర్టీసీ) టూర్ ప్యాకేజీల కొరకు యాత్రా దానం - బస్సును బహుమతిగా ఇవ్వండి. ఒక ప్రత్యేక కార్యాచరణ పథకం రూపొందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. 2025 జూన్, 27వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్ అంతటా టూర్ ప్యాకేజి అనే కొత్త పథకాన్ని ప్రారంభించి అరుణాచలం, భద్రాచలం, నాగార్జున సాగర్, విశాఖపట్నం, విజయవాడ, యాదగిరిగుట్ట/స్వర్ణగిరి, వరంగల్, కాళేశ్వరం, అనంతగిరి, కొమురవెల్లి, ద్వారక తిరుమల/అన్నవరం, వేములవాడ మొదలైన పర్యాటక ప్రాంతాలకు అన్ని డిపోల నుండి ప్రతీవారం టూర్ ప్యాకేజీలు చేపట్టి క్రమం తప్పకుండా టూర్ నిర్వహించబడుతున్నాయన్నారు. ప్యాకేజీలను మెరుగుపరచడానికి దోహదపడే, యాత్రా దానం బన్సు ప్రయాణాన్ని బహుమతిగా ఇవ్వండి. అనే కొత్త పథకాన్ని సంస్థ ప్రతిపాదించినట్లు తెలిపారు. దీనిలో సొంత కుటుంబసభ్యులు, బంధువులు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, కార్పొరేట్ సంస్థలు, ఎన్ ఆర్ ఐ లు, స్వచ్ఛంద సంస్థలు, కుటుంబాలు లేదా వ్యక్తుల స్పాన్సర్షిప్తో అర్హులైన సంఘాలకు ఏర్పాటు బస్సు ప్రయాణం చేయబడుతుందన్నారు. ఈ పర్యటనలతో తీర్థయాత్రలు, విహారయాత్రలు లేదా ప్రత్యేక వినోద ప్రయోజనాలకోసం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, ప్రియమైనవారి స్మారక దినాలు లేదా ఇతర వ్యక్తిగతంగా ముఖ్యమైన సంఘటనల వేడుకలు లేదా జ్ఞాపకార్థం కొరకు అంకితం చేయవచ్చునన్నారు. యాత్రా దానం గిఫ్ట్ ఎ బస్ ట్రావెల్ స్కీమ్ అనేది సంస్థ ప్రారంభించిన ఒక వినూత్న ప్రజా సంక్షేమ కార్యక్రమం అని, ఇది వ్యక్తులు, కుటుంబాలు, కార్పొరేట్ సంస్థలు, సంఘాలు, ఉమ్మడి కుటుంబాలు, స్వచ్చంద సంస్థలు, సంఘాలు లేదా ఏదైనా ఇతర చెల్లుబాటు అయ్యే చట్టబద్ధమైన సంస్థలు, ధార్మిక సంస్థలకు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, వైకల్యం ఉన్న సమూహాలు, ఇతర అర్హత కలిగిన సేవలను స్పాన్సర్ చేయడానికి అనుమతిస్తుందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలియజేశారు.
Post a Comment