లష్కర్ సింగారం లోని UPHC లో స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ లో భాగంగా మెగా హెల్త్ క్యాంప్ ను వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ..... మహిళల ఆరోగ్య పరిరక్షణకు స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని ఎంపీ డా.కడియం కావ్య అన్నారు. ఈ నెల 17 నుంచి అక్టోబరు 2 వరకు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తారని చెప్పారు. మహిళలకు వివిధ రకాల స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించి, అవసరమైన వారికి తగిన వైద్య సేవలను అందించాలని వైద్యఆరోగ్యశాఖ అధికారులను ఎంపీ డా.కడియం కావ్య ఆదేశించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అనంతరం టి.బి పేషంట్లకు ఎంపీ న్యూట్రిషన్ కిట్ల ను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ అప్పయ్య, ఇతర వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment