శాయంపేట మండలం, సెప్టెంబర్ 17: ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం పురస్కరించుకొని మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద బిజెపి మండలాధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది
ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది. అనంతరం స్వాతంత్ర్య సమరయోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహానికి పుష్పమాలలు వేసి నివాళులు అర్పించారు.
మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ
> “తెలంగాణ విమోచన దినోత్సవం అనేది ప్రతి ఒక్క తెలుగు వ్యక్తికి గర్వకారణం. నిజాం పాలనలో బానిస సంకెళ్ళకు బందీ అయిన తెలంగాణ ప్రజలకు 1948 సెప్టెంబర్ 17వ తేదీ నాడు స్వేచ్ఛ లభించింది. సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారి ధైర్యసాహసాల ఫలితంగానే తెలంగాణా విముక్తి సాధ్యమైంది. ఈ చారిత్రక దినాన్ని ప్రతి పౌరుడు జ్ఞాపకం చేసుకోవాలి.తెలంగాణలో ప్రజల పోరాటం, చాకలి ఐలమ్మ వంటి వీరమహిళల త్యాగాలు, రైతాంగ పోరాటం – ఇవన్నీ ఈ దినోత్సవానికి ప్రేరణలుగా నిలిచాయి. భవిష్యత్తు తరాలకు ఈ చరిత్రను చేరవేయడం మనందరి బాధ్యత.భారతీయ జనతా పార్టీ తెలంగాణలో నిజమైన ప్రజా పరిపాలనను తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తుంది.విలువలను కాపాడుతూ, ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుంది.” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రాయరాకుల మొగిలి, మండల ప్రధాన కార్యదర్శులు భూతం తిరుపతి, మామిడి విజయ్, సీనియర్ నాయకులు, బూర ఈశ్వరయ్య, బాసని విద్యాసాగర్, గంగుల రమణారెడ్డి, గడ్డం రమేష్, ఉప్పు రాజు, మోత్కూరి సత్యనారాయణ, మంద సురేష్ యువ మోర్చా జిల్లా నాయకులు లడ్డు శివ, కొత్తపెళ్లి శ్రీకాంత్,, మండల ఉపాధ్యక్షులు, పోల్ మహేందర్, కోమటి రాజశేఖర్, మండల కార్యదర్శి, మేకల సుమన్, జొన్నత్తుల జీవన్ రెడ్డి, మండల కోశాధికారి, కుక్కల మహేష్, భూత్ అధ్యక్షులు,బాసాని నవీన్, పున్నం సాంబయ్య, కోడెపాక సంజీవరావు, గొండ శ్రీను, కొంగరి సుధాకర్, ఎర్ర తిరుపతిరెడ్డి,శివకుమార్, బత్తుల రవి, నూటంకి మురళి తదితరులు పాల్గొన్నారు
Post a Comment