వరంగల్అనేకమంది త్యాగమూర్తుల త్యాగఫలమే నేడు మనం సంతోషంగా జరుపుకుంటున్న ప్రజాపాలన దినోత్సవం అని రాష్ట్ర అటవీ,పర్యావరణ,దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రివర్యులు కొండా సురేఖ అన్నారు.ఈరోజు
వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని అజంజాహి గ్రౌండ్ లో కొత్త కలెక్టరేట్ ఐ డి ఓ సి పక్కన నిర్వహించిన “తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ” వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు కొండా సురేఖ. పాల్గొన్నారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకు నివాళులర్పించి, అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. తర్వాత జాతీయ గీతం మరియు తెలంగాణ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతం భారతీయ యూనియన్‌లో చేరి ప్రజా పాలన ప్రారంభమై 77 సంవత్సరాలు పూర్తై 78వ సంవత్సరం అడుగుపెడుతున్న సందర్భంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు, పాత్రికేయులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు మరియు జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.రాచరిక వ్యతిరేక పోరాటంలో దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, బండి యాదగిరి వంటి నాయకుల స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం బలపడిందని గుర్తుచేశారు.అనేకమంది త్యాగమూర్తుల త్యాగఫలమే నేడు మనం సంతోషంగా జరుపుకుంటున్న ప్రజా పాలన దినోత్సవం అని రాష్ట్ర పర్యావరణ అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసిందని, జిల్లాలో 8871 ఇందిరమ్మ ఇండ్లను మొదటి విడత మంజూరు చేశామని ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం ద్వారా 14 కోట్ల రూపాయలకు రైతులకు ఖాతాలో జమ చేశామని రైతు నేస్తం కార్యక్రమాలలో రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తల సహకారంతో సలహాలు అందిస్తూ వ్యవసాయాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని, జిల్లాలో మామునూరు ఎయిర్పోర్ట్ వరంగల్ టెక్స్టైల్ పార్క్ తో పాటు వరంగల్ రెండో రాజధాని అభివృద్ధి కోసం 4962 కోట్ల రూపాయలు కేటాయించామని, ఆడపిల్లల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించి భేటీ బచావో బేటి పడావో కార్యక్రమాన్ని బలోపేతం చేస్తున్నామని జిల్లాలో సాగునీరు అందించేందుకు జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ రబీ సీజన్లో రైతులకు కాలువల ద్వారా నీళ్లు అందిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని, పథకాలు వేగంగా అమలు చేస్తున్నామని తెలిపారు.
Post a Comment