బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం.. మోదీ 75వ జన్మదిన వేడుకలు

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా పరకాలలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణ శాఖ కార్యాలయంలో బీజేపీ అధ్యక్షుడు గాజుల నిరంజన్ జాతీయ పథకాన్ని ఆవిష్కరించగా, అనంతరం అమరధామంలో అమరవీరులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా పరకాల నియోజకవర్గ కాంటెస్ట్ ఎమ్మెల్యే పగడాల కాళీ ప్రసాద్ రావు, రాష్ట్ర నాయకులు డా. సిరంగి సంతోష్ కుమార్, డా. పెసరు విజయచందర్ రెడ్డి, కొండేటి శ్రీధర్, ఎడ్ల అశోక్ రెడ్డి పాల్గొన్నారు
అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. శక్తి స్థల్ వద్ద నరేంద్ర మోడీ గారికి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు పరకాల కూరగాయల మార్కెట్ చౌరస్తాలో కేక్ కట్ చేసి, ప్రభుత్వ దవాఖానలో రోగులకు బ్రెడ్, పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, 1947 ఆగస్టు 15న దేశవ్యాప్తంగా స్వాతంత్ర్యోత్సవాలు జరుపుకున్నప్పటికీ, హైదరాబాద్ సంస్థాన ప్రజలకు అది లభించలేదని, నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ స్వతంత్రంగా కొనసాగుతానని ప్రకటించడంతో ప్రజలు రజాకార్ల హింసను ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ నాయకత్వంలో 1948 సెప్టెంబర్ 13న ప్రారంభమైన ఆపరేషన్ పోలో ద్వారా సెప్టెంబర్ 17న నిజాం లొంగిపోయాడని, ఆ రోజు నుంచే తెలంగాణ ప్రజలకు నిజమైన స్వాతంత్ర్యం లభించిందని పేర్కొన్నారు. అందుకే సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దేవుడు మేఘనాథ్ పార్టీ జయంత్ లాల్ బెజ్జంకి పూర్ణ చారి పరకాల పట్టణం ప్రధాన కార్యదర్శులు సంఘ పురుషోత్తం పాలకుర్తి తిరుపతి జిల్లా నాయకులు ఎర్ర రామన్న సిరంగి సతీష్ కుమార్ మార్త రాజభద్రయ్య బిజెపి నాయకులు కుక్కల విజయ్ బాసాని సోమరాజు మిడిదొడ్డి నరేష్ దంచనాదుల కిరణ్ ధర్నా సునీల్ మార్త బిక్షపతి వెలిశెట్టి శారద మారేడుగొండ భాస్కరాచారి దంచనాల సత్యనారాయణ పావుశెట్టి శ్రీనివాస్ ఆకుల రాంబాబు కుంట మల్ల గణేష్ బూత్ అధ్యక్షులు ముత్యాల దేవేందర్ దాసరి వెంకటేశ్వర్లు ఆకుల శ్రీధర్ పిట్ట కిషోర్ ఉపేందర్ రెడ్డి మేకల ప్రవీణ్ వెలిశెట్టి రాజేష్ తడక విక్రం ఉడుత చిరంజీవి పల్లెబోయిన భద్రయ్య వెల్దండి హేమంత్ సంఘ నరేష్ తాడిచెట్టి రజినీకాంత్ దామ సతీష్ గోనెల నరసింహ పైడ్ల రంజిత్ ఆకుల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు 

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post