కాకతీయ పట్టణాభివృద్ది సంస్థ (కుడా) కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా వరంగల్ కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి  పాల్గొన్న కార్యక్రమాల వివరాలు
హనుమకొండలోని కాకతీయ పట్టణాభివృద్ది సంస్థ (కుడా) కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్  చాహత్ బాజ్ పాయ్  కలిసి, కుడా పీవో అజిత్ రెడ్డి, ఈఈ భీం రావు  మరియు పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. 
హనుమకొండ కలెక్టరేట్ లో రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి  శ్రీనివాస్ రెడ్డి  కలిసి జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. 
హనుమకొండ అదాలత్ కూడలిలో ఉన్న అమరవీరుల విగ్రహానికి ప్రజా ప్రతినిధులతో కలిసి నివాళులు అర్పించారు. 
కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి కుడా చైర్మన్‌గా తన భాద్యతలను విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా సంవత్సర కాలంలో చేపట్టిన ప్రగతి నివేదిక రిపోర్ట్ ను ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ డిసిసి అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ  అందించారు. 

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post