రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే బిఆర్ఎస్ నాయకులకు బుద్ధి చెప్తారు
బుధవారం హనుమకొండ లోని డిసిసి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ....అధికారం కోల్పోయిన తరువాత బి ఆర్ ఎస్ నేతలు సత్య హరిచంద్రుల్లా మాట్లాడటం సిగ్గుచేటు అని అన్నారు.ప్రజా క్షేత్రంలో ప్రతిపక్షం కూడా ఉండాలని ప్రజలు ఎన్నుకుంటే నాటి కేసీఆర్ కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన ఘనత మీది కాదా అని ప్రశ్నించారు.దళిత నాయకుడు ప్రతిపక్ష నేతగా ఉంటే ఓర్వలేని కుసంస్కారి కేసీఆర్ అని, రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని అన్నారు.ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పై విశ్వాసం లేదు అంటున్న మీరు దమ్ముంటే కెసిఆర్,కేటీఆర్,హరీష్ రావు రాజీనామా చేసి ఎన్నికల్లో గెలవండి అని సవాల్ విసిరారు.
మా ప్రభుత్వం పై ప్రత్యక్ష పోరాడటం చేత గాక బీజేపీ పార్టీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్న మీరు విమర్శించి దిగజారకండి అని అన్నారు. గడిచిన పార్లమెంట్ ఎన్నికల తెలంగాణ ప్రజలు ఒక్క సీటు రాకుండా టిఆర్ఎస్ ను బొంద పెట్టిన బుద్ధి మారలేదని, వీరి వ్యవహార శైలి చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బిఆర్ఎస్ గెలవదు అన్నారు
Post a Comment