బతుకమ్మ పండుగ రోజు ఇంటి పెద్ద దిక్కు హఠాన్మరణం.కొద్దిరోజులుగా వానలో తడుస్తూ ఇద్దరు ఆడపిల్లలతో తల్లి బిక్కువిక్కుమంటు జీవనం... స్పందించి సహాయం చేసిన పరకాల మున్సిపాలిటీ 9వ తాజా మాజీ కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి పరకాల మున్సిపాలిటీ పరిధి విలీన గ్రామం రాజీపేటలో ఇటీవల అకస్మాత్తుగా మృతి చెందిన పద్మ శాలి ముద్దుబిడ్డ ముదిగొండ రఘు కుటుంబాన్ని పరామర్శించి వారికి సహాయం చేయాలన్న ఉద్దేశంతో తొమ్మిదో వార్డు తాజా మాజీ కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి 50 కిలోల బియ్యం తోపాటు కిరాణా సామాను అందించారు. కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. ప్రభుత్వం ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు, ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ బిజెపి నాయకులు ధర్నా నారాయణ దాస్, వేముల అశోక్, వావిలాల రాజయ్య, కొర్ర సురేష్ తదితరులు పాల్గొన్నారు,,
పండగ పూట పేదింట్లో విషాదం
byBLN TELUGU NEWS
-
0
Post a Comment