జర్నలిస్టులు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని..., అవినీతి, అక్రమాలను వెలికి తీయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సూచించారు.
ఈనెల 24న జిల్లా కేంద్రంలోని ఇల్లంద క్లబ్ హౌస్ లో జరిగిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (TWJF) జిల్లా 3వ మహాసభలలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు, కార్యదర్శుల ఆధ్వర్యంలో నూతన కమిటీని ప్రకటించారు. కాగా, ఈరోజు(శుక్రవారం) సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా నూతన కమిటీ నాయకులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీ నాయకులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి వారదిగా ఉంటూ పనిచేయాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని, అవినీతి అక్రమాలను వెలికి తీయాలని సూచించారు
Post a Comment