పెద్ద కొడపాక పాఠశాలలో 10 సైకిల్లు పంపిణి చేసిన ప్రొఫెసర్ పేదరికం అసమానతలు లేని సమాజాన్ని నిర్మించాలంటే విద్యతోనే సాధ్యం అవుతుందని అప్పుడే మన జీవితానికి పరిపూర్ణత లభిస్తుందని కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ బైరి వెంకటరామిరెడ్డి అన్నారు
శాయంపేట మండలం పెద్దకోడపాక ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు మాలోతు సారయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడుతూవిద్యార్థులు పట్టుదల, అంకితభావం, క్రమశిక్షణతో చదివి తాము ఎంచుకున్న లక్ష్యాలనుసాధించాలని విద్యార్థులనుఉద్దేశించి మాట్లాడారుఅనంతరం దూర ప్రాంతాలు అయిన కామారెడ్డి పల్లి ,మైలారం, గోవిందపూర్, జోగంపల్లి నుండి వస్తున్న పదిమంది విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ చేసి వితరణ చాటుకున్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ మనం చదువుకున్న పాఠశాలలకు తిరిగి మనకు వీలైనంత స్థాయిలో సహకరించి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సహకరించాలని కోరారుఇంకా ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ మరియు ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొనిప్రొఫెసర్ బైరి వెంకటరామిరెడ్డి కృతజ్ఞతలు తెలుపుతూ విజయవంతం చేశారు
Post a Comment