శాయంపేట ఏపీఎంగా వేణుగోపాలరావు

శాయంపేట : శాయంపేట సురేఖ మండల సమాఖ్య నూతన అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ గా ఎర్రబెల్లి వేణుగోపాలరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏపిఎం వేణుగోపాలరావు ను సురేఖ మండల సమాఖ్య పాలకవర్గం, సీసీలు, కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్చ అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సురేఖ మండల సమాఖ్య అధ్యక్షురాలు గడిపే సుమలత, కార్యదర్శి అమ్మ వసంత, సిసిలు గాజుల కేదారి, గుర్రం విజయ్ కుమార్, దొమ్మటి ప్రభాకర్, బోట్ల హేమలత, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post