ఘనంగా నర్సంపేటలో సహస్ర కిరణం జనరల్ స్టోర్ ప్రారంభోత్సవం

ప్రొప్రైటర్ కందకట్ల రాజు కుమార్
నర్సంపేట పట్టణంలోని ప్రముఖ వ్యాపార ప్రాంతంలో సహస్ర కిరణం జనరల్ స్టోర్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం ప్రజల ఉత్సాహభరిత హాజరుతో ఉల్లాసంగా సాగింది.
ఈ స్టోర్‌ను ప్రొప్రైటర్ కందకట్ల రాజు కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. నిత్యావసర వస్తువులు, గృహోపయోగ సరుకులు, కిరాణా మరియు ఇతర అవసరమైన వస్తువులు ఒకే చోట అందుబాటులో ఉండేలా ఈ జనరల్ స్టోర్ ను రూపొందించారు.
ఈ సందర్భంగా కందకట్ల రాజు కుమార్ మాట్లాడుతూ –
“నాణ్యతా ప్రమాణాలతో, తక్కువ ధరలతో ప్రజలకు మరింత మెరుగైన సేవలందించడం మా ప్రధాన లక్ష్యం. నర్సంపేట ప్రజల ఆదరణకు కృతజ్ఞతలు” అని తెలిపారు.
ప్రారంభోత్సవానికి హాజరైన స్థానిక ప్రముఖులు, వ్యాపారవేత్తలు, స్నేహితులు, బంధువులు కందకట్ల రాజు కుమార్ అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post