బిజెపిరాష్ట్రకార్యవర్గసభ్యులుచదువురామచంద్రారెడ్డి భారతీయ జనతా పార్టీ చేపడుతున్న "హర్ ఘర్ తిరంగా" కార్యక్రమాన్ని విజయవంతం చేయడం లక్ష్యంగా శాయంపేట మండల కేంద్రంలో సన్నాహక సమావేశం బిజెపి మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చదువు రామచంద్రా రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్వారా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే ఉద్దేశంతో ప్రజల్లో జాతీయ పతాకం పట్ల గౌరవం కల్పించి, దేశభక్తిని బలోపేతం చేయాలని సంకల్పంతో రాష్ట్రపార్టీ ఆదేశాల మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమన్ని ఆగస్టు 10నుండి 12 తేదీల మధ్య మండలంలో తిరంగా యాత్ర నిర్వహించడం జరుగుతుంది ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయని వారు తెలిపారు. మండలంలోని ప్రతి గ్రామం నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు బీజేపీ కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయలని. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా ప్రాంగణాల్లో త్రివర్ణ పతాకాలను ఎగురవేస్తూ దేశభక్తిని చాటాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ఉందని అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి పౌరుడు విధిగా పాల్గొనాలని ప్రతి ఇంటికి వెళ్లి త్రివర్ణ పతాకాలను పంపిణీ చేయడం ద్వారా ప్రజల మధ్య దేశభక్తిని పెంపొందించాలనే సంకల్పంతో పార్టీ శ్రేణులు ముందుకెళ్లాలని ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా తీసుకొని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమం ముగింపులో "హర్ ఘర్ తిరంగా" ఉద్యమాన్ని శాయంపేట మండలంలో ఘనంగా నిర్వహిస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రాయరాకుల మొగిలి, జిల్లా కౌన్సిల్ మెంబర్ కానుగుల నాగరాజు, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పు రాజు, సీనియర్ నాయకులు వనం దేవరాజ్, మండల కార్యదర్శి మేకల సుమన్, భూత్ అధ్యక్షులు కడారి చంద్రమౌళి, పైడిమల్ల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు
హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం
byBLN TELUGU NEWS
-
0
Post a Comment