79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

స్థానిక ఉత్పత్తుల ప్రోత్సాహిద్దాం.వికసిత భారతాన్ని నిర్మిద్దాం
బీజేపీ రాష్ట్ర నాయకులు పరకాల నియోజకవర్గం కాంటెస్టెడ్ MLA Dr.పగడాల కాళీ ప్రసాద్ రావు 
79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో హన్మకొండ జిల్లా బిజెపి అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి రాష్ట్ర జిల్లా బిజెపి నాయకులతో కలిసి హన్మకొండ దీన్ దయాల్ నగర్ బిజెపి పార్టీ కార్యాలయంలో ఘనంగా జాతీయ పథకావిష్కరణ కార్యక్రమంలో మరియు హన్మకొండ దీన్ దయాల్ నగర్ బిజెపి పార్టీ కార్యాలయం నుండి అదాలత్ సర్కిల్ అమరవీరుల స్తూపం వరకు నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో దాదాపు 200 మంది విద్యార్థులతో కలిసి పాల్గొన్నబిజెపి రాష్ట్ర నాయకులు పరకాల నియోజకవర్గం కంటెస్టెడ్ MLA Dr. పగడాల కాళీ ప్రసాద్ రావు 
ఈ సందర్భంగా కాళీ ప్రసాద్ రావు మాట్లాడుతూ.. అందరు దేశభక్తితో ఆగస్టు 15న మరియు జనవరి 26న మాత్రమే కాకుండా 365 రోజులు ఆ భావాన్ని పెంపొందించుకోవాలని కోరారు. 
ముఖ్యంగా యువతను ఉద్దేశించి, తాము దేశం పట్ల బాధ్యతతో ఉండాలని, క్రమశిక్షణ అలవర్చుకోవాలి అని, సమాజం పట్ల కొంత సేవ భావం మరియు బాధ్యత కల్గి ఉండాలని ఉన్నతమైన ఉత్తమ దేశ పౌరులు కావాలని కోరారు. జాతీయ పండుగల విశిష్టతను, స్వాతంత్ర్య సాధనలో ఆనాటి ఎంతో మంది వీరుల త్యాగాలు ఈనాటి మన దేశ స్వేచ్ఛ యొక్క మూల ధనము అని గుర్తు చేశారు. ప్రజలందరూ ఎంతో చిత్త శుద్ధి తో జాతీయ గీతాళాపన చేసి మిఠాయిలు పంచుకొని పండగ చేసుకున్నారు. మన దేశం వివిధ రంగాలలో వేగవంతమైన మార్పులకు సాక్ష్యంగా నిలిచిందని, ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్’ అనే సూత్రాలతో నడుస్తున్న మోదీ ప్రభుత్వం వేగంతో పాటు సున్నితత్వంతో మార్పులు తీసుకువచ్చిందని అన్నారు. ఆర్థిక వృద్ధి నుండి సామాజిక అభివృద్ధి వరకు, ప్రజలకు సంబంధించిన అందరినీ కలుపుకొనిపోయేతత్వంతో సమగ్ర అభివృద్ధిపై దృష్టి సారించామని తెలిపారు.“మన సమష్టి విజయానికి మేం గర్విస్తున్నాము. అదే సమయంలో, వికసిత్ భారత్ ను నిర్మించడానికి ఆశ, విశ్వాసం, సంకల్పంతో ముందుకు సాగుతున్నాం. “దేశంలోని పలు రంగాలలో తీసుకువచ్చిన మార్పుల వివరాలను వెల్లడిస్తూ, అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు, ‘వికాస్‌వాద్‌’ను ప్రధాన స్రవంతిలోకి మోడీ తీసుకువచ్చారని, 2014లో భారత ప్రధానిగా నరేంద్ర మోడీ పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి, ‘దేశం ఫస్ట్’ తన ప్రతి విధానానికి మార్గదర్శకంగా ఉందని అన్నారు. ఎన్నో చారిత్రాత్మక విజయాలతో మోదీ ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్ అని కాళీ ప్రసాద్ రావు అన్నారు. 
వికసిత్ భారత్ లక్ష్యం సహకారం దిశగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుంది అని అన్నారు మరియు ఎన్నో చారిత్రాత్మక విజయాలతో మోది ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంది అని, ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకొని యావత్ దేశం ప్రధానమంత్రి అభినందనలు తెలుపుతుంది అని అన్నారు, అదేవిధంగా ఆపరేషన్ సీందూర్ మరియు చారిత్రాత్మక విజయం సాధించిన నేపథ్యంలో శక్తివంతమైన భారతదేశంలో చూసి యావద్దేశం గర్విస్తుందని కొనియాడారు, ఆపరేషన్ సిందూర్లో మన బలగాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రతి భారతీయుడికి గర్వకారణం, మన బలగాలు సరిహద్దు అవతల ఉన్న ఉగ్రవాద శిబిరాలను అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేయడం అద్భుతం, ఉగ్రవాదంపై పోరుకు ఆపరేషన్ సింధూర్ ప్రపంచవ్యాప్తంగా కొత్త ఒరవడిని సృష్టించింది అని వ్యాఖ్యానించారు.
దేశంలోనే అత్యున్నతమైన పదవిని మహిళకు కట్టబెట్టి, ప్రధాని మోదీ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలనే ఉద్దేశంలో ముద్రలోన్లు, ఉజ్వల గ్యాస్‌ పథకం, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన ప్రవేశపెట్టారన్నారు. ముస్లిం మహిళలకు త్రిపుల్‌ తలాక్‌ రద్దు చేసి వారి సంక్షేమం కోసం కృషి చేశారని వివరించారు. మహిళలు అన్నింటా ముందుండాలనే లక్ష్యంతో మోడీ సర్కార్ నారీ శక్తి వందన్ ను తీసుకొచ్చిందన్నారు. విద్యా, ఉద్యోగం ఇలా అన్నింటిలో మహిళలు చరిత్ర సృష్టించాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. నారీ శక్తి వందన్ చట్టం విధాన, చట్టాల రూపకల్పనలో మహిళల భాగస్వామ్యానికి ప్రధాన అవరోధాన్ని తొలగిస్తుందని, సమ్మిళిత పాలన యొక్క కొత్త శకాన్ని తెరపైకి తెస్తుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు వివిధ మోర్చా నాయకులు ప్రజా ప్రతినిధులు విద్యార్థులు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post