రేపు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అయ్యే అవకాశం..పోలవరం-బనకచర్లతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని నీటిపారుదల ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు సమావేశానికి హాజరు కావాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని ఆహ్వానించింది.ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ ఓ సర్క్యులర్‌ను విడుదల చేసింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీకి చేరుకోనున్నారు. కేంద్ర జలశక్తి మంత్రితో భేటీకి ముందు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనధికారికంగా సమావేశమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.బుధవారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో జరిగే భేటీలో ఇద్దరు సీఎంలు పాల్గొంటారు. ఈ సమావేశంలో చర్చించే అజెండాను తెలుగు రాష్ట్రాలే ఖరారు చేసుకొని, సోమవారం సాయంత్రం 5 గంటల్లోగా పంపించాలని కేంద్ర జలశక్తి శాఖ సంయుక్త కార్యదర్శి ప్రదీప్ కుమార్ అగర్వాల్ లేఖ రాశారు. తెలంగాణ సర్కారు సమావేశ అజెండాను పంపినట్లు తెలిసింది.
డిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..!!
byBLN TELUGU NEWS
-
0
Post a Comment