పాక్ లో శివాలయం కూల్చివేతకు కుట్రలు.. మొరాయించిన జేసీబీలు.. తీవ్ర అనారోగ్యం---

పాకిస్తాన్‌లో ఓ చిత్రం జరిగింది. అక్కడి హిందూ వ్యతిరేక ప్రభుత్వం కరాచీలోని ఓ శివాలయాన్ని కూల్చేసి, దాని స్థానంలో ఓ మాంసం దుకాణం పెట్టాలని నిర్ణయించింది. కానీ... అక్కడి హిందూ వ్యతిరేక ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది.
 శివాలయాన్ని కూల్చడానికి అక్కడి అధికారుల నుంచి అనుమతి కూడా పొందారు. శివాలయాన్ని కూల్చేయడానికి సర్వం సిద్ధమైంది. కానీ..కూల్చడానికి సిద్ధమైన సమయంలో జేసీబీలు ప్రారంభం కాగానే.. అవి చెడిపోయాయి. రెండు సార్లు వరుసగా ఇలానే జరిగాయి. శివాలయాన్ని తవ్వుదామని జేసీబీలను స్టార్ట్ చేయడమే ఆలస్యం అవి పాడవడం జరిగింది.
 అంతేకాకుండా మరో విచిత్రం కూడా జరిగింది. దీనిని కూల్చడానికి కాంట్రాక్టర్ క్రేన్‌ని ఉపయోగించడానికి సిద్ధపడిపోయాడు. అంతలోనే అతని కుమారుడు తీవ్ర అనారోగ్యానికి గురై కోమాలోకి కూడా వెళ్లిపోయాడు.దీంతో వెంటనే సదురు కాంట్రాక్టర్ శివాలయాన్ని కూల్చాలన్న నిర్ణయం నుంచి వెనక్కి తగ్గాడు. ఆలయాన్ని తన సొంత డబ్బుతోనే బాగు చేయాలని కూడా నిర్ణయానికి వచ్చేశాడు. ఇలా సంకల్పం చేశాడో లేదో.. వెంటనే వాళ్ల కుమారుడు బాగయ్యాడు. ఈ వార్త కాస్త పాకిస్తాన్ అంతటా వ్యాపించింది. దీంతో శివాలయంపై, హిందూ దేవాలయాలపై తమ వైఖరిని మార్చుకున్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post