భూపాలపల్లి/శాయంపేట:శాయంపేట గ్రామ మాజీ సర్పంచ్, శాయంపేట గ్రామ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి వలుపదాసు చంద్రమౌళి ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా, వారికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రమౌళి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ది, సంక్షేమ పథకాలకు ఆకర్షితుడినై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ సర్పంచ్ ఎన్నికల్లో శాయంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బాసాని శాంత - రవి తన పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు.
కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న శాయంపేట గ్రామ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి వలుపదాసు చంద్రమౌళి
byBLN TELUGU NEWS
-
0
Post a Comment